నిరుద్యోగులకు కొలువుల పండుగ.. 3,168 ఉగ్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 09:12:51  IST  )

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు.

నిరుద్యోగులకు కొలువుల పండుగ.. 3,168 ఉగ్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఊరటనిస్తూ 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తం 25కు పైగా ముఖ్యమైన అజెండా అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా ప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 3,168 పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో ‘నేతన్న భరోసా’ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల కోసం రూ.50 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. మార్క్‌ఫెడ్ (Markfed) సంస్థకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ నుంచి పొందే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ, వినికిడి లోపం ఉన్న వారికి బాపట్లలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఓకే చెప్పారు.

Next Story