- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడెతో అంబులెన్స్ కావాలని వినూత్న నిరసన
తమ మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు శంకర్ గురువారం కుబీర్ మండల కేంద్రంలోని వివేకానంద చౌక్‌లో పాడెతో వినూత్న నిరసన చేపట్టారు.

దిశ, భైంసా : తమ మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు శంకర్ గురువారం కుబీర్ మండల కేంద్రంలోని వివేకానంద చౌక్‌లో పాడెతో వినూత్న నిరసన చేపట్టారు. మండలంలో అంబులెన్స్ లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాడె వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాలకులు తమ బాధలను గుర్తించి, వెంటనే మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మండలంలో దాదాపు ప్రతిరోజూ ఒక డెలివరీ కేసు నమోదవుతుండగా, నెలకు సుమారు 10 వరకు అత్యవసర వైద్య కేసులు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ లేకపోవడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని, తక్షణమే అంబులెన్స్‌ను మంజూరు చేసి ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.






