రేపు మణుగూరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Taduka Kalyani |

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ & విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మణుగూరులో పర్యటించనున్నారు.

రేపు మణుగూరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, మణుగూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ & విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మణుగూరులో పర్యటించనున్నారు. ఆయన తొలుత ఉదయం 9:20 గంటల నుండి 10 గంటల వరకు మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన డి ఏ వి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైండ్లను సందర్శించి పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్ళనున్నారు.

Next Story