- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ రేసులో గూగుల్ మరో అద్భుతం.. ఎన్విడియాకు పోటీగా ‘ఫ్రోజెన్ v2’ చిప్!
గూగుల్ తన జెమిని ఏఐ మోడల్స్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త సర్వర్ చిప్‌ను అభివృద్ధి చేస్తోంది.

దిశ, ఫీచర్స్ : వరల్డ్ ఫేమస్ సెర్చ్ ఇంజిన్ సిస్టమ్‌గా ప్రఖ్యాతి గాంచిన గూగుల్ మరో సాంకేతిక ముందడుగు వేసింది. తన జెమిని ఏఐ (Gemini AI) మోడల్స్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త సర్వర్ చిప్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని కోడ్ నేమ్ “Frozen v2” కాగా.. దీనిని 2028లో విడుదల చేయనున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం గూగుల్ ఉపయోగిస్తున్న ఏఐ హార్డ్‌వేర్‌తో పోలిస్తే.. ఈ కొత్త చిప్ ఒక్క యూనిట్ ఎనర్జీకి 6 నుంచి 10 రెట్లు ఎక్కువ టోకెన్స్ (ఏఐ వేగంగా స్పందించే సమాచారం) ఉత్పత్తి చేయగలదని చెబుతున్నారు.
ఫ్రోజెన్ వి2 (Frozen v2) అనే కొత్త చిప్ అభివృద్ధి గూగుల్ కంప్యూటింగ్ ఖర్చులను భారీగా తగ్గించవచ్చునని కూడా నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఏఐ మోడల్స్ నడపడానికి అవసరమైన శక్తి, సామర్థ్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. సమస్యలను తగ్గించడంలో ఇది కీ రోల్ పోషిస్తుంది. ఎన్విడియా(Nvidia)పై ఆధారపడటం కూడా తగ్గించవచ్చు. అయితే ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, దీని గురించి సాంకేతిక నిపుణులు చర్చిస్తున్నప్పటికీ, ఈ ప్రాజెక్టు గురించి గూగుల్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు, కానీ కొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ డిజైన్లను పరీక్షిస్తున్నట్లు మాత్రం నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఈ డెవలప్‌మెంట్ గూగుల్ ఏఐ రంగంలో మరింత పోటీగా ముందుకు వెళ్లడానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడంలోనూ ఇది కీలకం అవుతుంది.






