- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముసలమడుగులో తాళం వేసిన ఇంట్లో చోరీ
బూర్గంపాడు మండల పరిధిలోని ముసలమడుగు గ్రామంలో ఒక ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి, బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దిశ,బూర్గంపాడు: బూర్గంపాడు మండల పరిధిలోని ముసలమడుగు గ్రామంలో ఒక ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి, బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించి బాధితుడు నూకల కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి సమీపంలోని హోటల్‌కు వెళ్లారు. ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్ళాక బీరువా,సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు.
దుండగులు ఇల్లు గుల్ల చేసి రూ.లక్షల్లో విలువైన వస్తువులను అపహరించుకెళ్లారు. 15 గ్రాముల బంగారం, 250 గ్రాములు వెండి (వెండి కంచంతో కలిపి) టీవీ,హోమ్ థియేటర్ రూ.30 వేలు నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ సీన్ వద్ద ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీమ్ ని రప్పించారు. పోలీసులు ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.






