శ్రీ విష్ణు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సాక్షి మడోల్కర్.. వీడియో తో కన్ఫామ్ చేసిన మేకర్స్

by Pulgam srinivas |

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబో సినిమాలో సాక్షి మాడల్కర్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

శ్రీ విష్ణు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సాక్షి మడోల్కర్.. వీడియో తో కన్ఫామ్ చేసిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: 'సామజవరగమన' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని చిత్ర బృందం ఇంతకాలం అధికారికంగా వెల్లడించలేదు. తాజాగా ఈ చిత్రంలో సాక్షి మాడల్కర్ కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రోషన్ హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మోగ్లీ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాక్షి, ఇప్పుడు శ్రీ విష్ణు సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో ఆమెకు ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. 'సామజవరగమన'కు పనిచేసిన భాను బోగవరపు, నందు సావిరిగణ ఈ చిత్రానికి కూడా కథ, మాటలను అందిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Next Story