- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముక్కోటి ఏకాదశి, కళ్యాణోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
భద్రాచలం పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ముక్కోటి, శ్రీరామనవమి వేడుకలకు ఎటువంటి ఆటంకం లేకుండా రామాలయం అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.

దిశ, భద్రాచలం: భద్రాచలం పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ముక్కోటి, శ్రీరామనవమి వేడుకలకు ఎటువంటి ఆటంకం లేకుండా రామాలయం అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. గురువారం భద్రాచలంలో జరుగుతున్న రామాలయం అభివృద్ధి పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అభివృద్ధిలో భాగంగా వైకుంఠ ద్వారం తొలగించడం జరిగిందని, డిసెంబర్‌లో వచ్చే ముక్కోటి నాటికి మళ్ళీ ద్వారం పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అదనంగా ఇంజనీరింగ్ అధికారులను నియమించి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌కు సూచించడం జరిగిందని తెలిపారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనులు పురోగతిని హైదరాబాద్ నుండి పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. రామాలయం ఈఓ దామోదర్ రావు ఆధ్వర్యంలో ప్రతి వారానికి ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పుష్కరాలకు ముందే శ్రీరామ నవమి పర్వదినం వస్తున్న కారణంగా, రామయ్య కళ్యాణం నాటికే పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రామాలయం ఈ ఓ దామోదర్ రావు, ఏ ఈ ఓ లు శ్రావణ్ కుమార్, భవాని రామకృష్ణ, ఈ ఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






