- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'చెన్నై లవ్ స్టోరీ' మూవీకి మొదట అనుకున్నా జోడి ఎవరో తెలుసా?
'చెన్నై లవ్ స్టోరీ' కోసం మొదట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీని ఎంపిక చేశారు.

దిశ, వెబ్ డెస్క్: యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. అయితే మొదట ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను కాకుండా మరో జంటను హీరో, హీరోయిన్‌లుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అప్పట్లో విడుదలైంది.
అయితే కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, వారి స్థానంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను తీసుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరు? వారు ఎందుకు తప్పుకున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన 'బేబీ' చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా, ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు ఆనంద్–వైష్ణవి జంటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ఆ విజయంతో అదే జంటతో మరో సినిమా చేయాలని భావించిన చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వైష్ణవి చైతన్య ఇతర చిత్రాలకు కమిట్ అయ్యారు. అదే సమయంలో ఆనంద్ దేవరకొండ కూడా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. దీంతో వారిద్దరూ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, వారి స్థానంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






