- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోగస్ ఓటర్లను తొలగించి ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలి
ఆమనగల్లు మున్సిపాలిటీలో బోగస్ ఓటర్లను ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి, అక్రమంగా ఓటరు జాబితాలో నమోదైన వారి పేర్లను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ అమనగల్లు మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీలో బోగస్ ఓటర్లను ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి, అక్రమంగా ఓటరు జాబితాలో నమోదైన వారి పేర్లను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ అమనగల్లు మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ మున్సిపల్ అధ్యక్షుడు అవ్వారి శివలింగంలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానికంగా నివాసం లేని వారు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి అక్రమంగా నమోదు చేసుకున్న వారి పేర్లను సమగ్రంగా పరిశీలించి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించబడేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి ఈ వినతి పై సానుకూలంగా స్పందించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సమగ్ర పరిశీలన నిర్వహించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, విజయ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, కొండల్ రెడ్డి, అలీమ్ నాజర్, ఫరీద్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.






