- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో ‘దూధియా బదన్’ ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నటుడు అన్నూ కపూర్ (Anny Kapoor), నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia)పై తాను గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. పొలిటికల్‌గా దేశానికి 1947 ఆగస్టు 15న మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందని, కానీ మన సమాజం ఇంకా మానసికంగా బ్రిటీషర్ల గులాములుగానే ఉండిపోయిందని కామెంట్ చేయడం వివాదాస్పదంగా మారింది.
అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్నూ కపూర్‌ను యాంకర్ తమన్నాపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల ట్రోలింగ్ గురించి ప్రశ్నించారు. దీంతో ఆయన రెస్పాండ్ అవుతూ.. ఇంగ్లీషులో బూతులు మాట్లాడినా, పదాలు వాడినా ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. కానీ, హిందీలో మాట్లాడితేనే వివాదం చేస్తారని తెలిపారు. మిల్కీ బాడీ (Milky Body) అని ఇంగ్లీషులో అంటే ఎవరూ పట్టించుకోరని.. మాతృ భాషలో ‘దూధియా బదన్’ అంటే మాత్రం తప్పుగా చూస్తారంటూ మళ్లీ వివాదాన్ని రాజేశారు. మనం దాదాపు 250 ఏళ్లు బ్రిటీషర్ల (Britishers) కింద బానిసలుగా ఉన్నామని.. స్వతంత్య్రం వచ్చినా మెంటల్‌గా మనం ఇప్పటికీ వారి గులాములుగానే ఉన్నామని అన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యల వల్ల తమన్నా మనస్తాపం చెంది ఉంటే, ఆమెకు క్షమాపణలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నూ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
కాగా, గతంలో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తమన్నా నటించిన ‘ఆజ్ కీ రాత్’ పాట గురించి మాట్లాడుతూ.. ‘వావ్, వారెవ్వా దూధియా బదన్’ అంటూ అన్నూ కపూర్ చేసిన కామెంట్స్ తీవ్ర నెగెటివిటీకి, నెటిజన్ల ట్రోలింగ్‌కు దారితీసిన సంగతి తెలిసిందే.






