- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో హనుమాన్ విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడు అరెస్ట్
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహం చోరీకి గురైన సంగతి తెలిసిందే. భారీ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన ప్రతిష్టించిన చిన్న విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో దుండగులు దొంగలించారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహం చోరీకి గురైన సంగతి తెలిసిందే. భారీ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన ప్రతిష్టించిన చిన్న విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో దుండగులు దొంగలించారు. దొంగలించిన వ్యక్తి విగ్రహాన్ని ఓ వస్త్రంలో చుట్టి తీసుకువెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు కలిసి విగ్రహాన్ని వెతికేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు జస్వంత్ రెడ్డిగా గుర్తించారు. ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకుని విగ్రహం స్వాధీనం చేసుకున్నారు. కేవలం 14 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడంతో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగానికి ప్రశంసలు అందుతున్నాయి. విగ్రహాన్ని తిరిగి అదే స్థానంలో ప్రతిష్టించగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయం చుట్టూ ఇనుప గ్రీల్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. మెట్ల మార్గంలో సీసీ టీవీ కెమెరాలను సైతం పెంచుతామని చెప్పారు.






