విద్యుత్ షాక్‌తో మెకానిక్ మృతి

by Jakkula.Mamatha |

విద్యుత్ షాక్‌తో మెకానిక్ మృతి
X

దిశ, చండూరు: విద్యుత్ షాక్‌తో బోరు బావి మోటార్ తీసే మెకానిక్ మృతి చెందిన సంఘటన గురువారం చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మున్సిపాలిటీ 3వ వార్డు లకినేనిగూడెంకు చెందిన బోరుబావిలో మోటర్ తీసే మెకానిక్ షేక్ సయ్యద్ తండ్రి మదర్ సాబ్(38) గురువారం ఉదయం పుల్లెంల గ్రామానికి చెందిన బద్దుల స్వామి బోరు మోటర్ రిపేర్ కొరకు తీసుకెళ్లాడు. ఆ సందర్భంలో కరెంట్ షాక్ గురైనట్లు తెలిపారు. 108 ద్వారా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story