నిర్మాత బండ్ల గణేశ్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం‌కోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 08:30:25  IST  )

స్థిరాస్థి వేలం వ్యవహారంలో నిర్మాత బండ్ల గణేష్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది.

నిర్మాత బండ్ల గణేశ్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం‌కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ (Bandla Ganesh)కు అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు (Tealangana High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.. తన వ్యాపార రుణాలకు సంబంధించి జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని సవాలు చేస్తూ బండ్ల గణేశ్ గతంలో న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో బ్యాంక్ చేపట్టిన వేలం సరైనదేనని, ఇందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవల యూనియన్ బ్యాంక్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

అయితే, హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేశ్ ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు బ్యాంక్ ఆస్తి వేలం వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, బండ్ల గణేశ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. స్పష్టం చేసింది.

Next Story