ఎల్ నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-23 07:31:43  IST  )

ఎల్‌నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితుల పై వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించారు.

ఎల్ నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు
X

దిశ, వనపర్తి రూరల్: ఎల్‌నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితుల పై వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో వరి పంటకు నీటి అవసరం ఎక్కువ కనుక వరి సాగుకు బదులుగా స్వల్ప కాలిక వర్షాధారిత ఆరుతడి పంటలు సాగు చేయాలని అంకూర్, క్రిష్ణగిరి అచ్యుతాపూర్, అంజన గిరి, పెద్దతండా, పడమటి తండా, గుంత తండా, నాగమ్మ తండా, మెంటపల్లి, మరియు సవాయిగూడెం గ్రామాలలోని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. వాటిలో పప్పు దినుసు పంటలు కంది, మినుము,పెసర, అలసందలు మరియు ఉలవలు పండించుకోవచ్చు.

తృణ ధాన్యలు పంటలలో రాగి, కోర్ర , సజ్జ పండించుకోవచ్చు నూనె గింజలు పంటలైన వేరుశనగ ఆముదం పంటలు పండించుకోవచ్చు లేదా ఆకుకూరలు లేదా కాయగూరలు పండించుకోవచ్చని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వనపర్తి మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీనివాస్, శ్రీకాంత్, యుగంధర్, మోహిత, కవిత మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

Next Story