- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చింది.. కానీ ఆ కారణంతో రిజెక్ట్ చేశాను: జబర్దస్త్ సత్యశ్రీ
తనకు బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందని, కానీ కుటుంబ బాధ్యతల కారణంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సత్యశ్రీ వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సత్యశ్రీ ఒకరు. చమ్మక్ చంద్ర టీంలో చాలా కాలం పాటు కొనసాగిన ఆమె, తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అనంతరం పలు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుని నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. గత కొంతకాలంగా సత్యశ్రీకి బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన సత్యశ్రీ.. తనకు నిజంగానే బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని వెల్లడించింది. అయితే కుటుంబ సభ్యులు తనపై ఆధారపడి ఉండటం, అలాగే తాను కూడా కుటుంబానికి దూరంగా ఎక్కువ రోజులు ఉండలేనని తెలిపింది. ఇంటి బయట తాను చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఉండటంతో, మంచి అవకాశం వచ్చినప్పటికీ బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం సత్యశ్రీ టెలివిజన్ కార్యక్రమాలతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉంటూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.






