'నేను రెడీ' ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన మేకర్స్

by Pulgam srinivas |

'నేను రెడీ' చిత్రంలోని మొదటి పాటను రేపు సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

నేను రెడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: హవీష్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'నేను రెడీ'. ఈ చిత్రానికి త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలోని 'కొంచెం కొంచెం' అంటూ సాగే తొలి లిరికల్ వీడియోను రేపు సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఫస్ట్ సింగిల్‌లో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. ఈ ఐటమ్ సాంగ్‌తోనే నర్గీస్ ఫక్రీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు.




Next Story