- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజేపీ నిరసనలపై దాఖలైన పిటిషన్ స్వీకరణ.. రేపే విచారణ జరపనున్న ఢిల్లీ హైకోర్టు
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలపై దాఖలైన పిటిషన్‌పై ఎట్టకేలకు ఢిల్లీ హైకోర్టు స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: కాక్రోచ్ పార్టీ చేపడుతున్న నిరసన ప్రదర్శనలపై దాఖలైన పిల్‌పై రేపు విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకె.ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫు న్యాయవాది బరున్ కుమార్ సిన్హా ఇవాళ ప్రస్తావించారు. విద్యార్థి ఉద్యమం పేరుతో ఈ నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయని, దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందులకు గురవుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపిన అంశాలను, అత్యవసర విచారణ అభ్యర్థనను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ స్పందిస్తూ ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని వెల్లడించారు.






