- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లమ్మ సన్నిధిలో వెంటనే క్షమాపణలు చెప్పాలి : కోట నీలిమ
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం ఆలస్యానికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కారణమని సనత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కోట నీలిమ ఆరోపించారు.

దిశ, ఖైరతాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం ఆలస్యానికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కారణమని సనత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కోట నీలిమ ఆరోపించారు. రథోత్సవం ఆలస్యంపై భక్తులకు సమాధానం చెప్పడంతో పాటు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు కోట నీలిమ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ రథోత్సవం ఆలస్యంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఎల్లమ్మ అమ్మవారి ఉత్సవాల విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని పేర్కొన్నారు. రథోత్సవం ఆలస్యానికి బాధ్యత వహిస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ భక్తులకు క్షమాపణలు చెప్పాలని కోట నీలిమ డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించాలని, ఈ వ్యవహారం పై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






