- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి : సుదర్శన్ రెడ్డి
ఎల్ నినో ప్రభావం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును చేసుకోవాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్ మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.

దిశ, జగదేవపూర్ : ఎల్ నినో ప్రభావం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగును చేసుకోవాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్ మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని తిగుల్ లో గురువారం ఎల్‌నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, నీటి సంరక్షణ చర్యల పై ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా సాధ్యమైనంతగా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులు మళ్లాలని సూచించారు.
నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని పంటల వైవిధ్యీకరణ చేపట్టడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు. అనంతరం వీబీజీ రామ్ జీ టీఏ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫామ్ ఫండ్స్, ఊటకుంటలు, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలు వంటి వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాల ప్రాముఖ్యతను వివరించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత పరశురామ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాస్ శర్మ, ఏఈఓ శరణ్య, కార్యదర్శి నరేష్ రెడ్డి, ఏఎంసీ వైస్ మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.






