- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మూర్లో ప్రభుత్వ బాలికల పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 2009-2010 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు.

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 2009-2010 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు కవిత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి,తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోని తాము ఈ స్థానాల్లో స్థిరపడ్డామని పేర్కొన్నారు. అప్పటి పాఠశాలలోని తరగతి గదుల్లోని మధుర స్మృతులను, తీపి జ్ఞాపకాలను విద్యార్థులు నెమరు వేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులందరూ పలు సినీ గేయాలపై చేసిన నృత్యాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు కృష్ణవేణి, అరుణ, సంధ్య రాణి, శకుంతలాదేవి, అంబుజా రాని,నీరజ, విద్యార్థులు విజేత, రమ్య, రవళి, రాజ్యలక్ష్మి, చౌల్ మౌనిక, తదితరులున్నారు.






