నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యం కావాలి

by Taduka Kalyani |

ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఎఫ్ ఎస్ ఏ) నవిత అన్నారు.

నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యం కావాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జూన్ 07: ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఎఫ్ ఎస్ ఏ) నవిత అన్నారు. నిజామాబాద్ లోని ఐడీఓసీ (కలెక్టరేట్) కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆహార భద్రతా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి (ఎఫ్ ఎస్ ఓ) నవిత పర్యవేక్షణలో ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, ఫోస్టాక్ శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 160 మంది ఫుడ్ హ్యాండ్లర్లు (ఆహార నిర్వాహకులు), అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత అన్నారు. ఆహారాన్ని తయారు చేసేటప్పుడు, పంపిణీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ప్రమాణాల గురించి కూడా కార్యక్రమంలో ఫుడ్ హ్యాండ్లర్లకు అవగాహన కల్పించారు.

Next Story