- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోరుగా స్క్రాప్ దందా..
మంచిర్యాల జిల్లాలో స్క్రాప్ దుకాణాలు పుట్టగొడుగుల పుట్టుకొచ్చాయి.

దిశ, మంచిర్యాల: జిల్లాలో స్క్రాప్ దుకాణాలు పుట్టగొడుగుల పుట్టుకొచ్చాయి. స్క్రాప్ తుక్కు దందాను జోరుగా నడిపిస్తున్నారు. ఈ దందాలో ఆరితేరిన ఘనులు కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్క్రాప్ దుకాణాలపై సంబంధిత అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన లేకపోవడం స్క్రాప్ దందా పెట్రేగిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు తీసుకోవాల్సి ఉండగా అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నారని విమర్శలు సైతం ఉన్నాయి. కొంతమంది చోటామోటా బడ లీడర్ల పేర్లు చెప్పుకుంటూ తెర వెనుక ఉండి దందా సాగిస్తున్నారని తెలుస్తోంది. నిబంధనలను గాలికి వదిలేసి స్క్రాప్ దందాను జనావాసాల్లో స్క్రాప్ దుకాణాలు ఏర్పాటుచేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులపై అధికారులు తమకేమీ పట్టనట్టు ఉండడం పై విమర్శలకు దారితీస్తుంది.
జనావాసాల మధ్య స్క్రాప్ దుకాణాలు...
స్క్రాప్ తుక్కు దందా దుకాణాలు జిల్లాలో పుట్టగొడుగుల వెలిశాయి. మంచిర్యాల, మందమర్రి, కేతనపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షట్ పేట మున్సిపాలిటీలలో జనావాసాల్లోనే వెలిశాయి. దుకాణాల్లో ప్లాస్టిక్, రబ్బరు, గాజు సీసాలు, ఇనుము వివిధ రకాల దుక్కును నిల్వ చేస్తూ గోదాంలో నిలువ చేస్తున్నారు. ఒక్కో రకం వస్తువును కాంప్రెస్ చేసి బండిలుగా చేస్తున్నారు. ఐచర్ వ్యాన్లలో పరిమితికి మించి లోడును హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పెద్ద స్క్రాప్ దుకాణాలకు తరలిస్తున్నారు. ఇలాంటి నిబంధనలు, అనుమతులు లేకుండా తుక్కును నిలువ చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. కనీస భద్రత ప్రమాణాలు పాటించకుండా చేస్తున్న ఈ తుక్కు దందాపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనావాసాల్లో నిలువ చేసిన గోదాముల వద్ద అపరిశుభ్రత వాతావరణం నెలకొందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్క్రాంప్ దందా దుకాణాలపై మున్సిపాలిటీ కింది స్థాయి సిబ్బంది నిర్వాహకుల నుండి చేతివాటానికి పాల్పడుతున్నారని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంత తతంగం నడుస్తున్న అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.
రూ. లక్షల్లో వ్యాపారం..
పట్టణ ప్రాంతాలతో పాటు కొన్ని మండలాల్లో ఏర్పాటుచేసిన ఈ స్క్రాప్ దుకాణాలకు రూ. లక్షల్లో ఆదాయం సమకూరడంతో కొంతమంది ఈ దందాపై దృష్టి సారించారు. వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిరుపేదలను ఈ ఊబిలోకి ఆగుతున్నారు. పాత పాడైన ఆటో రిక్షాలను కొనుగోలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోకి పంపిస్తున్నారు. మామూలుగా కిలో ఇనుముకు రూ.20 నుండి రూ.30 చొప్పున కొనుగోలు చేస్తూ తుక్కు సరుకును టన్నులకొద్దీ హైదరాబాద్ నగర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. తుక్కు సామ్రాజ్యంలో కొందరు బడాబాబులు ధనార్జని ద్యేయంగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ప్లాస్టిక్, మద్యం ఖాళీ సీసాలను కిలోపు రూ. 10 నుండి కొనుగోలు చేస్తున్నారు. కొంత పాడై, విలువైన సామాగ్రిని సైతం కొనుగోలు చేస్తూ రహస్యంగా గోదాముల్లో నిలువ చేస్తున్నారు. కొంతమందికి జీవనోపాధికి ఇలాంటి పెట్టుబడి లేకుండా దందా చేసే అవకాశం ఉండడంతో స్క్రాప్ దుకాణాలు రమేపి వ్యాపార సామ్రాజ్యంగా విస్తరిస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ కరువు..
మంచిర్యాల జిల్లాలో కొందరు స్క్రాప్ దుకాణాల గనులు విలువైన సామాగ్రిని సైతం అక్రమ మార్గంలో తరలిస్తూ గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో కేతనపల్లి సింగరేణి మైనింగ్ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ కు సంబంధించిన సామాగ్రి స్క్రాప్ దుకాణాల కు చేరినట్లు తెలిసింది. ఈ ఘటన వెనుక సింగరేణి ఎస్ అండ్ పి సి అధికారులు ఆ ఏరియాలో గలను పట్టుకునేందుకు స్క్రాప్ దుకాణాలపై దాడులు సైతం నిర్వహించారు. ఇందులో విలువైన సామాగ్రి పైన చీకటి మార్గంలో దొంగతనాలకు పాల్పడి స్క్రాప్ రూపేనా వాహనాల్లో ప్రాంతాలకు తరలించి ఆ సామాగ్రి అవసరమయ్యే వారికి అందించేలా చేస్తున్నారని గుసగుసలు ఇప్పిస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారులు పట్టింపు లేనట్లు ఉండడంతో స్క్రాప్ దందా కు అడ్డు చెప్పేవారే లేకుండా పోతుందనే అనుమానం లేకపోలేదు. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జనావాసాల మధ్య ఉండే స్క్రాప్ దుకాణాలపై సంబంధిత శాఖ అధికారులు వాటిని తొలగించి దూర ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.






