మంత్రిగా ఏడాది పూర్తి.. రూ.1600 కోట్ల అభివృద్ధి ప‌నులు

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర పాడి పరిశ్రమలు, పశుసంవర్ధక, మత్స్యశాఖ, క్రీడల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు స్వీకరించి సోమ‌వారంతో సంవత్సరకాలం పూర్తి అవుతోంది.

మంత్రిగా ఏడాది పూర్తి.. రూ.1600 కోట్ల అభివృద్ధి ప‌నులు
X

దిశ‌, మ‌క్త‌ల్ : రాష్ట్ర పాడి పరిశ్రమలు, పశుసంవర్ధక, మత్స్యశాఖ, క్రీడల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు స్వీకరించి సోమ‌వారంతో సంవత్సరకాలం పూర్తి అవుతోంది. అభివృద్ధిలో అంతంత మాత్రంగానే ఉన్న మక్తల్ ను అభివృద్ధి పరిచేందుకు నిరంతరం శ్రమిస్తూ వాకిటి శ్రీహరి అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి ఏడాది కాలంలో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధికి ఇప్ప‌టికే దాదాపు రూ.1600 కోట్ల నిధులను మంజూరు చేయించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ వంతమైన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి వాకిటి శ్రీహరి నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగు తున్నాయి. విద్య,వైద్యం,రహదారులు, వ్యవసాయం, మౌలిక వసతులు, దేవాలయాల అభివృద్ధి వంటి రంగాల్లో భారీ నిధులు కేటాయించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశ గా చర్యలు చేపట్టారు.

విద్యారంగంలో భాగంగా నూత‌న ఇంట‌ర్, డిగ్రీ, పీజీ క‌ళాశాల భ‌వ‌న నిర్మాణానికి రూ.9కోట్లు నిధులు యువ భార‌త ఇంటిగ్రేటేడ్ పాఠ‌శాల నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేశారు. క్రీడల అభివృద్ధికి మక్తల్ గ్రౌండ్ కి రూ. 25 కోట్లు, నర్వ గ్రౌండ్ కి 4 కోట్లు, ఊట్కూర్ గ్రౌండ్ కి 2.50 కోట్లు, ఆత్మకూర్ గ్రౌండ్ కి 4 కోట్లు కేటాయించారు. రోడ్లు, ర‌వాణా సౌక‌ర్యాల మెరుగుద‌లకు మ‌క్త‌ల్ నారాయ‌ణపేట ర‌హ‌దారి అభివృద్ధికి రూ.210 కోట్లు, జూరాల వంతెన నిర్మాణానికి రూ.123 కోట్లు, మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో హై లెవ‌ల్ బ్రిడ్జీల నిర్మాణానికి రూ.45 కోట్లు, కృష్ణాన‌ది పై కోల్పూర్ వ‌ద్ద బ్రిడ్జీ నిర్మాణానికి రూ.700 కోట్ల భారీ ప్రాజెక్టు చేప‌ట్టారు. బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.68.50 కోట్లు, పీడబ్ల్యూడీ రహదారి (బిజ్వార్-పెద్దజేట్రం మార్గం) అభివృద్ధికి రూ.36 కోట్లు కేటాయించబడ్డాయి. వైద్య రంగంలో మక్తల్లో 150 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.43 కోట్లు మంజూరు చేయడంతో పాటు మక్తల్, ఆత్మకూర్ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు సీఎంఆర్ఎఫ్/ఎల్ఎసీ కింద రూ.12 కోట్లతో పేద ప్రజలకు వైద్య సహాయం అందించడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రైతులకు 1500 డీటీఆర్ ట్రాన్స్ ఫార్మర్ల అనుమ తులు మంజూరు చేశారు. పట్టణ, గ్రామీణాభివృద్ధిలో భాగంగా అమరచింతలో సమీకృత కార్యాలయ భవన నిర్మాణానికి రూ.16.50 కోట్లు, మున్సిపల్ అభివృద్ధి నిధుల కింద మక్తల్, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు కేటాయించారు.


అదనంగా ఎస్ఎఎఫ్ అభివృద్ధి రూ.15 కోట్లతో నిదులతో సీసీ రోడ్లు, ఇతర పనులు చేపట్టారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అభివృద్ధిలో భాగంగా దేవాలయాల అభివృద్ధికి 5.70 కోట్లు, గట్టు తిమ్మప్ప దేవాలయ అభివృద్ధికి ఓక్క కోటి కేటాయించబడింది. మక్తల్ 220 స‌బ్ స్టేష‌న్ రాయికోడు, 132 సబ్ స్టేషన్ మాగ‌నూరు మండలంలోని రేండు 32/12 సబ్ స్టేషన్లు మంజూర‌య్యాయి. మక్తల్ మున్సిపాలిటీలో దండు గ్రామంలో పాల నియంత్రణ కేంద్రం.గొల్లపల్లి గ్రామంలో పశు సంవర్ధక ట్రైనింగ్ సెంటర్ మంజూరు చేయించి భూసేకరణ పూర్తయింది. వీటితోపాటు దాదాపు 65 కోట్లతో మారుమూల గ్రామాల నుండి నియో జకవర్గ కేంద్రానికి రోడ్లకునిదులు మంజూర‌య్యాయి. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం, ప్రతి మండలం సమగ్ర అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు పార్టీల రహితంగ అఖిలపక్ష నాయకులందరూ కలిసి మరింత అభివృద్ధి జరిగేలా సలహాలు ఇచ్చి మక్తల్ అభివృద్ధి చేతులి కొత్త రూపుని ఇద్దామని అందరము కలిసి పనిచేద్దామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

Next Story