- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచొద్దు
విద్యార్థులపై తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిడి పెంచొద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.

దిశ, నిజామాబాద్ అర్బన్ జూన్ 07: విద్యార్థులపై తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిడి పెంచొద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శాలివాహన ( కుమ్మర ) ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ భవన్ లో విద్యార్థులకు విద్య శిరోమణి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పదో తరగతి, ఇంటర్మీడియట్ లలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్లాలని వారికి సూచించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా ఎదగాలని, కన్నవారికి, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఎవరూ మన నుండి దొంగిలించని సంపద విద్య అని, ఆ విద్యతోనే ఉన్నత శిఖారలను అధిరోహించడం సాధ్యమన్నారు. కుమ్మర కులస్తులు రాజకీయంగా ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, శాలివాహన కులస్తులకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డుల ప్రదానం చేశారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కుమ్మర ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ భూపతి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సాయికుమార్, జిల్లా గౌరవాధ్యక్షులు కనకం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.






