మిస్ ఇండియాను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించిన సోనూసూద్..

by Kodari Anjali |

ఖమ్మం నగరానికి చెందిన మిస్ ఇండియా ఎం ఏ ఫరహాని ప్రముఖ బాలీవుడ్ నటుడు, హ్యూమనిటేరియన్ సోనూ సూద్ ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.

మిస్ ఇండియాను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించిన సోనూసూద్..
X

దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మం నగరానికి చెందిన మిస్ ఇండియా ఎం ఏ ఫరహాని ప్రముఖ బాలీవుడ్ నటుడు, హ్యూమనిటేరియన్ సోనూ సూద్ ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారతను ప్రోత్సహించే ఒక ప్రేరణాత్మక వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ, ప్రతి మహిళ తనను తాను నిరూపించుకోవాలని, తన లక్ష్యాలను ఎప్పుడూ కొనసాగించాలన్నారు. వివాహం అనంతరం కూడా కలలు, ఆశయాలను వదులుకోకుండా ముందుకు సాగాలని ఆయన సూచించారు. మహిళ తన గుర్తింపును కోల్పోకూడదని, తన శక్తిని సమాజానికి ఉపయోగపడేలా మార్చుకోవాలని ఆయన ప్రేరేపించారు. ఈ సత్కారం ఖమ్మం నగరానికి గర్వకారణంగా నిలిచింది. స్థానికంగా ఉన్న ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందకరమైన విషయమని పలువురు అభిప్రాయపడ్డారు. అనంతరం ఎం ఏ ఫరహా మాట్లాడుతూ, మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. సమాజంలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా ఇతర మహిళలకు ప్రేరణగా మారాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కేవలం వ్యక్తిగత విజయాన్ని మాత్రమే కాకుండా, మహిళా సాధికారతకు బలమైన సందేశాన్ని అందిస్తూ సమాజంలో సానుకూల మార్పుకు దారి చూపిందని నిర్వాహకులు తెలిపారు.

Next Story