- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి..
by Kodari Anjali |
పేకాట స్థావరాలపై దాడులు చేసి 67 వేల నగదు ముగ్గురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు.

X
దిశ, చెన్నూర్: పేకాట స్థావరాలపై దాడులు చేసి 67 వేల నగదు ముగ్గురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం చెల్లాయిపేట, దుగ్నేపల్లి శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆదివారం పేకాట స్థావరంపై దాడిచేసి పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నామని పోలీసుల రాకను గమనించిన దాదాపు 15 మంది వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినట్లు ఆయన తెలిపారు. పారిపోయిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల నుండి 67 వేల రూపాయల నగదు, 3 సెల్ఫోన్స్ స్వాధీన పరుచుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






