- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాలతీతంగా దేవాలయ అభివృద్ధికి కృషి : పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇస్నాపూర్ లోని పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణ పనులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శంకుస్థాపన చేశారు.

దిశ, పటాన్ చెరు టౌన్ : ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇస్నాపూర్ లోని పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణ పనులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎండకు, వానకు పడుతున్న ఇబ్బందులను గమనించిన స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని నీలం మధు దృష్టికి తీసుకెళ్లారు. దీని పై తక్షణమే స్పందించిన ఆయన, ప్రభుత్వ నిధుల మంజూరు ప్రక్రియ కోసం వేచి చూడకుండా, భక్తుల కష్టాలను తీర్చడమే ధ్యేయంగా తన సొంత నిధులతోనే ఈ షెడ్డు నిర్మాణాన్ని చేపట్టేందుకు ఉదారంగా ముందుకొచ్చారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో కౌన్సిలర్ మల్లేశ్వరి కుమారుడు మణికంఠ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నీలం మధు, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం షెడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేసి నిర్మాణ వ్యయాన్ని నిర్వాహకులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్నాపూర్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి ప్రతివారం నియోజకవర్గ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారని, ముఖ్యంగా పండుగలు, జాతరల సమయంలో సరైన నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆధ్యాత్మిక భావన సమాజంలో శాంతిని పెంపొందిస్తుందని, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించాలనే సంకల్పంతో ఈ నిర్మాణాన్ని తలపెట్టినట్లు వివరించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజాసేవలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. భక్తుల ఇబ్బందులను గుర్తించి, రాజకీయాలకు అతీతంగా సొంత ఖర్చులతో నీడను కల్పించేందుకు ముందుకు రావడం పై ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు నీలం మధును శాలువాతో ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లీశ్వరి మణికంఠ, కౌన్సిలర్స్ మన్నే రాఘవేంద్ర, వెంకటేష్ నాయక్, సంగన్నగారి గోపాల్, సందీప్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు రాఘవేంద్ర, శంకర్, సంజీవ, ఆంజనేయులు, కృష్ణ, రాజు, మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, యువకులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






