- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంకాపూర్ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం..
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1998 -99 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆర్మూర్ పట్టణ శివారులోని అర్గుల్ రోడ్ లో మైత్రి గార్డెన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1998 -99 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆర్మూర్ పట్టణ శివారులోని అర్గుల్ రోడ్ లో మైత్రి గార్డెన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరూ హాజరై, పూర్వపు గురువులందరినీ ఘనంగా సన్మానించారు.27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్నందుకు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా పూర్వపు పాఠశాల మధుర స్మృతులను తీపి జ్ఞాపకాలను ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. అలాగే గురువులతో ఉన్న సన్నిహిత్యాన్ని వారు నేర్పిన విద్యాబుద్ధులను పూర్వ విద్యార్థులు చర్చించుకుని చాలా ఆనందోత్సవాల మధ్య గడిపారు. గురువులు అందించిన విద్యను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేము అని పూర్వ విద్యార్థులు గురువుల గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో అంకాపూర్ ప్రభుత్వ పాఠశాల పూర్వపు ప్రధానోపాధ్యాయులు నరసయ్య, ఉపాధ్యాయులు దామోదర్, ప్రకాష్, అమర్నాథ్, లక్ష్మణ్, పూర్వపు విద్యార్థులు శృంగార నరసయ్య, చారి, వాజిద్, సామ నర్సారెడ్డి, సూర్యం, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, జగదీష్, స్వామి, అశోక్, ప్రవీణ్, జ్యోతి, నీత, పుష్పలత, అనిత, తదితరులు పాల్గొన్నారు.






