రేపు 23 పార్టీలతో ఇండీ కూటమి మీటింగ్

by Muthe.Rajitha |

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జూన్ 8న మధ్యాహ్నం 12 గంటలకు 'ఇండియా జన్‌బంధన్'(INDIA Bloc) కూటమి అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది.

రేపు 23 పార్టీలతో ఇండీ కూటమి మీటింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జూన్ 8న మధ్యాహ్నం 12 గంటలకు 'ఇండియా జన్‌బంధన్'(INDIA Bloc) కూటమి అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కూటమిని మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. కూటమిలోని మొత్తం 23 పార్టీలు ఈ సమావేశంలో భాగస్వామ్యం కానున్నాయి. కాంగ్రెస్ తరఫున మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, ఎస్పీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో పాటు మరికొందరు కీలక జాతీయ నాయకులు దీనికి హాజరవుతున్నారు. కాగా తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను (టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం) డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్ వైఖరిని "బీట్రేయల్" గా అభివర్ణిస్తూ, ఈ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు ఈ ఆప్ పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ప్రకటించింది.

Next Story