- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవాలయం వంటిది ఆకాశవాణి
ఆకాశవాణి అనేది దేవాలయం వంటిదని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు.

దిశ, రవీంద్ర భారతి : ఆకాశవాణి అనేది దేవాలయం వంటిదని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తాను చదువుకునే రోజుల్లో ఆకాశవాణి వారి ఎడిషన్ కు హాజరయ్యానని..నాటకాల్లో కూడా పాల్గొన్ననని గుర్తు చేశారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో గగన విజయం – విశేష అష్టావధానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి రమణాచారి మాట్లాడుతూ, అష్టావధానం అనేది తెలుగు సాహిత్య సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూ మన సంస్కృతి, సృజనాత్మక మేథో సంపత్తికి అద్దం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అష్టావధానిగా నల్లాన్ చక్రవర్తుల సాహిత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి. హరిసింగ్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రోగ్రామ్ హెడ్ రమేష్ సుంకసారి, న్యూస్ హెడ్ మహేష్, దూరదర్శన్ యాదగిరి ప్రోగ్రాం హెడ్ కామేశ్వరి, సమన్వయ కర్త – దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జి.ఎం. రామశర్మ పాల్గొన్నారు.






