- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షాకాలానికి ముందే అలర్ట్.. అధికారులకు సబితా ఇంద్రారెడ్డి కీలక ఆదేశాలు
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కాలనీల్లో ఎలాంటి ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, మీర్‌పేట్ : వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కాలనీల్లో ఎలాంటి ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్, జిల్లెలగూడ డివిజన్‌లలో రూ.1.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలు, నివాస ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందితేనే ఆ ప్రాంతానికి మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు నియోజకవర్గాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే వినియోగించబడేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో పరిశీలించి, చెత్తాచెదారం, పూడిక, వ్యర్థాలను వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అర్కల కామేశ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, దిండు భూపేష్ గౌడ్, అనిల్ యాదవ్, సిద్దాల చిన్న బీరప్ప, లక్ష్మణ్ ముదిరాజ్, సిద్దాల అంజయ్య, మదారి రమేష్, విజయ్, గోపి యాదవ్, ప్రవీణ్ రెడ్డి, సునీత బాలరాజ్, లలిత జగన్, పంతంగి మాధవి, సురవిలత, బిందు తదితరులు పాల్గొన్నారు.






