టేకులపల్లి ఎల్‌ఎస్‌ఎన్‌ఓబీ కార్మికుల సమస్యలపై వినతి..

by Kodari Anjali |

ఎల్‌ఎస్‌ఎన్‌ఓబీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలపై సంబంధిత సింగరేణి అధికారులకు ఐఎఫ్‌టియు వినతి పత్రం అందజేశారు.

టేకులపల్లి ఎల్‌ఎస్‌ఎన్‌ఓబీ కార్మికుల సమస్యలపై వినతి..
X

దిశ, టేకులపల్లి: ఎల్ ఎస్ ఎన్ ఓ బీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న డైవర్స్ బ్లాస్టింగ్, టైర్ సెక్షన్ తదితర విభాగాల కార్మికుల సమస్యలపై సంబంధిత సింగరేణి అధికారులకు ఐఎఫ్‌టియు వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగానే సింగరేణి యాజమాన్యం సూచన మేరకు ఆదివారం ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఎల్ఎస్ఎన్ ఓబి మేనేజర్ శివతో చర్చలు నిర్వహించింది. అనంతరం వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులకు ప్రతినెల 10వ తారీఖున వేతనాలు చెల్లించాలని కోరగా హామీ ఇచ్చారు. బ్లాస్టింగ్ కార్మికులకు రెడ్ టీషర్ట్స్, టవల్స్ వారి జీతాలను ఇతర ఓబీలను సంప్రదించి చెల్లించేందుకు అంగీకరించారు. టీషర్ట్స్‌ను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. డ్రైవర్స్ వేతనాలను ఇతర ఓబీ యాజమాన్యాలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను సంప్రదించి ఆయా ఓబీలలో ఇస్తున్న జీతాలను చెల్లించేందుకు హామీనిచ్చారు.

సెలవు కావాలని యాజమాన్యాన్ని కోరగా..

పెండింగ్ లో ఉన్న ఈపిఎఫ్‌ను రెండు నెలల్లో పరిష్కరిస్తానని జూన్ నెల నుండి ప్రతినెల ఈపీఎఫ్ కార్మికుడి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులపై వేధింపులను ఆపాలని చిన్న కారణానికి డ్యూటీ ఆపడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుడు విధుల్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే హామీ పత్రం రాయించుకొని డ్యూటీ ఇవ్వటానికి అంగీకరించారు. ప్రతి కార్మికుడు చెప్పపెట్టకుండా డ్యూటీ మానేస్తున్నారని ఒకరోజు ముందు సెలవు కావాలని యాజమాన్యాన్ని కోరాలని యాజమాన్యం కోరగా.. ఐ ఎఫ్ టి యు అంగీకరించింది. కార్మికుల దృష్టి తీసుకపోతామని ఐ ఎఫ్ టి యు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, రాష్ట్ర నాయకులు డి .ప్రసాద్, సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్, యూనియన్ రీజియన్ కార్యదర్శి నెమళ్ళ సంజీవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story