గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే

by Kodari Anjali |

శోభానాద్రిపురం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి & శ్రీ కంఠమహేశ్వర స్వామి వారికి నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే
X

దిశ, రామన్నపేట: మండలంలోని శోభానాద్రిపురం గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి & శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఏటెల్లి పరమేష్, మాజీ సర్పంచ్ చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, యాదవ సంఘం అధ్యక్షుడు ముక్కాంల ఐలయ్య యాదవ్, గౌడ సంఘం అధ్యక్షుడు బొడిగా ఆంజనేయులు, గ్రామ పెద్దలు ముక్కామల పాపయ్య, కొండకింది శేఖర్ రెడ్డి, తాడూరి సైదులుపల్లి, సాయికిరణ్ గౌడ్, నరసింహ, విద్య కమిటీ మాజీ చైర్మన్ గోగు సైదులు, కడారి సతీష్, కడారి స్వామి, ముక్కామల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story