- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవులకు మించి.. వెబ్ ట్రాఫిక్‌లో AI ఏజెంట్లదే హవా!
ఏఐ ఏజెంట్ల వల్ల వెబ్‌సైట్లకు ఎక్కువ లోడ్, బ్యాండ్‌విడ్త్ ఖర్చు పెరుగుతుంది. యాడ్ రెవెన్యూ తగ్గుతుంది.

దిశ, ఫీచర్స్ : ఏఐ ఇప్పుడు అనేక విషయాల్లో మనుషుల్ని మించిపోతోంది. ముఖ్యంగా సమాచార అభివృద్ధిలో, సేకరణలో సహాయపడుతోంది. అయితే ఏఐ ఏజెంట్లు (bots) మానవులకంటే ఎక్కువ వెబ్ ట్రాఫిక్‌ను సృష్టిస్తున్నాయని క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) డేటా తాజా నివేదిక పేర్కొన్నది. ప్రపంచ వ్యాప్తంగా హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (HTTP) రిక్వెస్టుల్లో 57% కంటే ఎక్కువ ఏఐ ఏజెంట్ల నుంచి వస్తుండగా.. మానవుల నుంచి 43% మాత్రమే వస్తున్నట్లు తెలిపింది. చాట్‌జీపీటీ, జెమిని, క్లౌడ్ వంటి చాట్‌బాట్లు ఉపయోగించినప్పుడు కూడా ఈ ఏజెంట్లు ఆటోమేటిగ్గా వెబ్‌ను సెర్చ్ చేసి, డేటా సేకరించి ట్రాఫిక్‌ను పెంచుతున్నట్లు వెల్లడించింది.
ఇండియాలో భిన్నంగా..
అయితే ఏఐ ఏజెంట్ల పనితీరు భారతదేశంలో మాత్రం కాస్త భిన్నంగా ఉందంటున్నారు నిపుణులు. ఇక్కడ మానవులు 84.4% హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ రిక్వెస్టులు ఉత్పత్తి చేస్తుండగా, చాట్‌బాట్లు కేవలం 15.6% మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇది వెస్ట్రన్ కంట్రీస్‌తో పోలిస్తే భారత్ ఇప్పటికీ మానవ-కేంద్రీకృత ట్రాఫిక్‌ను కలిగి ఉందని సూచిస్తున్నది. క్లౌడ్‌ఫ్లేర్ నివేదిక ప్రకారం.. భారత్‌లో వెబ్ సెర్చింగ్ మానవ ట్రాఫిక్‌లో 66% మొబైల్ ద్వారా, 34% పీసీల ద్వారా వస్తోంది. ఇది భారత్ మొబైల్-ఫస్ట్ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను ప్రతిబించిస్తున్నది. అంతేకాకుండా ఈ మార్పు వెబ్ డిజైన్, సెక్యూరిటీ, కంటెంట్ క్రియేషన్, ఎస్‌ఈఓ (SEO)& యాడ్స్ స్ట్రాటజీలపై భారీ ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. ఇండియాలో మానవ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ, క్రమంగా ఏఐ (AI) ఏజెంట్ల వృద్ధి వేగం పెంచుకుంటున్నదని అంచనా వేస్తున్నారు.
లాభమా? నష్టమా?
*ఏఐ ఏజెంట్లు (bots) మానవులకంటే ఎక్కువ వెబ్ ట్రాఫిక్‌ను సృష్టించడం, వాటి ప్రభావం పెరగడంవల్ల అనేక లాభాలు, అదే సమయంలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. లాభాల విషయానికి వస్తే. వేగవంతమైన, ఖచ్చితమైన సమాచారం గ్రహించడం సాధ్యమవుతుంది. షాపింగ్, రీసెర్చ్, బుకింగ్ వంటి పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. వ్యాపారాలకు కొన్ని సందర్భాల్లో ఎక్కువ కన్వర్షన్స్ (ఏజెంట్ నేరుగా కొనుగోలు చేస్తే) సంభవిస్తుంది. ఇంటర్నెట్ మరింత డైనమిక్‌గా మారుతుంది.
*నష్టాల విషయానికి వస్తే.. వెబ్‌సైట్లకు ఎక్కువ లోడ్, బ్యాండ్‌విడ్త్ ఖర్చు పెరుగుతుంది. సరైన అనుమతి లేకుండా కంటెంట్ స్క్రాపింగ్ వల్ల కాపీరైట్ సమస్యలు రావచ్చు. వెబ్‌సైట్లకు యాడ్ రెవెన్యూ తగ్గుతుంది (ఏజెంట్లు యాడ్స్ చూడవు). SEO, వెబ్ డిజైన్ మారాల్సి వస్తుంది. అంటే ఇంటర్నెట్ “మానవుల కోసం” కాకుండా “ఏజెంట్ల కోసం” మారాల్సి రావచ్చు. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ రిస్కులు పెరుగుతాయి.






