- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్ శర్మకు కేంద్రం అరుదైన గౌరవం
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోహిత్ శర్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. క్రీడా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా క్రీడారంగానికి సంబంధించి ఎనిమిది మందికి పద్మ అవార్డులు లభించగా.. వీరిలో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్జ్కు పద్మవిభూషణ్, భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, భారత సీనియర్ మహిళల హాకీ జట్టు గోల్కీపర్ సవిత పూనియా సహా మరో ముగ్గురికి (బల్దేవ్ సింగ్, భగవాన్దాస్ రైక్వార్, కే పజనివేల్) పద్మశ్రీ అవార్డులు లభించాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్.. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.
READ MORE ....






