- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్, కోహ్లీలకు షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025-26కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి ‘ఏ+’ కేటగిరీని తొలగించనున్నట్టు బోర్డు సెక్రెటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ‘ఏ+’ కేటగిరీని తొలగిస్తున్నాం. ఎందుకంటే ఆ కేటగిరీలో ఉన్న ప్లేయర్లు మూడు ఫార్మాట్లలో ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. దీనివల్ల ‘ఏ+’ కేటగిరీకి అర్హత సాధించడానికి మేము నిర్దేశించిన ప్రమాణాలు నెరవేరడం లేదు.’అని సైకియా వెల్లడించారు. కేవలం ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడే ప్లేయర్ ‘ఏ+’కు అర్హుడు కాదని తెలిపారు.
ప్రస్తుతం ‘ఏ+’ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఉన్నారు. వీరిలో బుమ్రా మాత్రమే మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. రో-కోలు టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. టీ20లకు గుడ్ బై చెప్పిన జడేజా వన్డేలు, టెస్టులు ఆడుతున్నాడు. ప్రస్తుతం ఈ నలుగురు వార్షిక వేతనంగా రూ.7 కోట్లు పొందుతున్నారు. ఏ కేటగిరీ ఆటగాళ్లు రూ.5 కోట్లు, బి కేటగిరీలో ఉన్న ప్లేయర్లు రూ.3 కోట్లు, సి కేటగిరీ క్రికటర్లు రూ. కోటి పొందుతున్నారు. కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో కేవలం ఏ, బీ, సీ కేటగిరీలు మాత్రమే ఉండనున్నాయి. అయితే, ఈ కేటగిరీలలో ఉండే ప్లేయర్లు అందుకునే వార్షిక వేతనాన్ని బీసీసీఐ పెంచే అవకాశం ఉంది.
READ MORE ....






