రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి..అజిత్ పవార్ ప్రమాదంపై రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు

by Malleboina Mahesh |   (  Updated:2026-02-21 10:51:38  IST  )

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ చేసిన సంచలన డిమాండ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి..అజిత్ పవార్ ప్రమాదంపై రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం (Ajit Pawar's plane crash)లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై మొదటి నుంచి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదంపై విచారణ పారదర్శకంగా జరగాలంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రోహిత్ పవార్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాస్తూ, విచారణ పూర్తయ్యే వరకు మంత్రిని పదవి నుంచి తొలగించాలని కోరారు.

ఈ ప్రమాదానికి గురైన లేజర్ జెట్ విమానాన్ని నిర్వహించిన 'VSR వెంచర్స్' సంస్థకు, తెలుగుదేశం పార్టీ (TDP) నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. VSR సంస్థ యజమాని కుమారుడి వివాహానికి టీడీపీకి చెందిన ఒక ముఖ్య నేత హాజరయ్యారని, అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఆ సంస్థపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగడం అసాధ్యమని ఆయన వాదించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ విచారణలో ప్రభావితం అయ్యే అవకాశం ఉందని, అందుకే స్వతంత్ర సంస్థ ద్వారా, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో దర్యాప్తు జరపాలని రోహిత్ పవార్.. ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అలాగే అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో అదనపు ఇంధన ట్యాంకులను ఉంచారని, ఇది విమానాన్ని ఒక 'ఫ్లయింగ్ బాంబు'లా మార్చిందని రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేశారు. విమానంలోని బ్లాక్ బాక్స్ దెబ్బతినడం వెనుక కూడా కుట్ర కోణం ఉండొచ్చని, ఇది కేవలం ప్రమాదం కాదని ఆయన అన్నారు. అజిత్ పవార్ మృతి వెనుక రాజకీయ, వ్యాపారపరమైన కుట్రలు ఉన్నాయో తేలాలని, ఈ విషయంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా స్వయంగా జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా రోహిత్ పవార్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

శ్రీకాళహస్తికి కేంద్రం సహకారం.. కేంద్రమంత్రి కీలక హామీ

Next Story