- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాళహస్తికి కేంద్రం సహకారం.. కేంద్రమంత్రి కీలక హామీ
శ్రీకాళహస్తి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తీస్వరాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి(Srikalahastri) అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తీస్వరాలయం(Srikalahasti Temple)లో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టు(Tirupati Airport)ను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు విమాన సర్వీసులు కల్పిస్తామని తెలిపారు.
అంతకుముందు తిరుమల శ్రీవారిని(Tirumala Srivaru) దర్శించుకున్న ఆయన అక్కడ సైతం మీడియాతో మాట్లాడారు. తాము కూడా తమ శాఖలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏఐ వినియోగం కోసం ఓ టీమ్ పని చేసిందని, ఆ బృందంతోనూ చర్చలు జరుపుతామని చెప్పారు. దేశంలో విమానయాన శాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్యాసింజర్ల సమాచారమని, ఆపరేషన్లను కమాండ్ కేంద్రం నుంచి నడిపిస్తే మంచి సౌకర్యాలు ఇవ్వొచ్చన్నారు. టీటీడీ కమాండ్ కేంద్రం తమకు ఆదర్శమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.






