తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

by Malleboina Mahesh |   (  Updated:2026-04-28 05:38:01  IST  )

తెలంగాణలో నిప్పుల వర్షం! మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నేడు ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.

తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్లుగా ఈ ఏడాది.. తెలంగాణలో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంతకుముందు రోజు కూడా ఆదిలాబాద్, నిర్మల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నిప్పుల కొలిమి లాంటి వాతావరణంతో అటు మనుషులు, ఇటు మూగజీవాలు విలవిలలాడుతున్నాయి.

ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో వాతావరణ శాఖ ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటివేళ, ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలు సేవించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది.

ఉత్తర తెలంగాణలో మండుటెండలు.. ఈ జిల్లాల్లో నేడు వడగళ్లకు ఛాన్స్ !

Next Story