- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూలు.. తొలి రెండు గంటల్లో రికార్డు స్థాయి పోలింగ్!
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఉదయం 9 గంటల వరకు వరుసగా 17.69%, 18.76% పోలింగ్ నమోదైంది. ఉదయం నుండే ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, తొలి రెండు గంటల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, ఉదయం 9 గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమ బెంగాల్‌లో (మొదటి విడత) 18.76 శాతం పోలింగ్ నమోదైంది. ఎండ తీవ్రత పెరగకముందే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలు ఉదయం నుండే క్యూలైన్లలో బారులు తీరారు.
ముఖ్యంగా మహిళలు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అలాగే ఎన్నికల సంఘం కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేయడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. దీంతో ఎక్కడ చూసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీగా క్యూలైన్లలో దర్శనమిస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే పాత రికార్డులను బ్రేక్ చేసి అత్యధిక పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా ఈ రోజు తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత కింద 152 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రముఖులు, సినీ నటులు సామాన్యులతో కలిసి లైన్ లో నిలబడి ఓటు వేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.






