మళ్ళీ తెరపైకి మావోయిస్టులు.. ఏకంగా 5 రోజులు బంద్‌కు పిలుపు!

by Jakkula.Mamatha |

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు భామ్రగడ్‌లో మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది.

మళ్ళీ తెరపైకి మావోయిస్టులు.. ఏకంగా 5 రోజులు బంద్‌కు పిలుపు!
X

దిశ, భద్రాచలం: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు భామ్రగడ్‌లో మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. హిదూర్-దోబూర్ రహదారిపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, కరపత్రాలు కలకలం సృష్టించాయి. జూలై 26 నుంచి 30 వరకు జిల్లా బంద్‌కు పిలుపునిస్తూ, గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బ్యానర్లు వెలియడంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు మరొక్కసారి ఉలిక్కిపడ్డాయి. భామ్రాగడ్ తాలూకాలోని హిదూర్-దోబూర్ ప్రధాన రహదారిపై మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కనిపించడంతో భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు.

ఈ కరపత్రాలు జూలై 26 నుంచి 30 వరకు గడ్చిరోలి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. నీరు, అటవీ మరియు భూమి సమస్యలపై నిరసనకు పిలుపునిచ్చారు. భామ్రాగడ్ తాలూకా ప్రధాన కార్యాలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కచ్చితమైన కరపత్రాలు, బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో విచారణ జరుగుతోంది. మావోయిస్టుల నిర్మూలన పూర్తిగా జరగలేదనే విషయం ఈ బ్యానర్లు అద్దం పడుతున్నాయి.

Next Story