- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్తినలో కీలక పరిణామం.. విద్యాశాఖ అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
‘నీట్’ పేపర్ లీక్‌పై ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన ఆందోళనను విరమిస్తున్నట్లుగా సీజేపీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ (Dharmebra Pradhan) రాజీనామా అనంతరం హస్తినలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) ఇవాళ మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రహ్లాద్ జోషికి విద్యా మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆయన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలతో పాటు నూతన, పునరుద్ధరణీయ ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపై వాటితో పాటు విద్యాశాఖను కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు. అదనపు బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు వేగవంతం చేయడం, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడమే తమ ప్రాధాన్యత అని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.






