- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా వైట్ బైరైటీస్ తరలింపు.. షాక్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు!
మండలంలోని బయ్యారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గంధంపల్లి గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి అక్రమంగా వైట్ వెరైటీస్ ఖనిజాన్ని తరలిస్తున్న లారీని ఫారెస్ట్ అధికారులు పట్టుకుని సీజ్ చేసినట్లు సమాచారం.

దిశ,బయ్యారం: మండలంలోని బయ్యారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గంధంపల్లి గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి అక్రమంగా వైట్ వెరైటీస్ ఖనిజాన్ని తరలిస్తున్న లారీని ఫారెస్ట్ అధికారులు పట్టుకుని సీజ్ చేసినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గార్ల- బయ్యారం మండల సరిహద్దులోని నగరం బీట్ లో గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గా ఉన్న సమయంలో కడపకు చెందిన బినామీల పేరుతో లీజు లు పొంది 2007- 2010 వరకు వైట్ వెరైటీస్ ఖనిజాన్ని బినామీల పేరుతో అక్రమంగా యదేచ్చగా ఆంధ్రాకు తరలించిన విషయం విధితమే, 2012 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గనుల లీజు ల వ్యవస్థను రద్దు చేశారు.
ఖరీదైన ఖనిజం కావడంతో ఇదే అదునుగా భావించి కొంతమంది నగరం ఫారెస్ట్ బీట్ సరిహద్దు గ్రామాల వారికి రాత్రి సమయంలో అక్రమంగా ఖనిజాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఎటువంటి అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో వైట్ వెరైటీస్ ఖనిజాన్ని లారీల ద్వారా కొందరు అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై బయ్యారం ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి కిరణ్ ఆదివారం ఫోన్ లో వివరణ కోరగా.. శనివారం అర్ధరాత్రి గార్ల మండలం నుంచి వైట్ వెరైటీస్ ఖనిజం రవాణా చేస్తున్న లారీని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి పూర్తి సమాచారం అందిస్తామని అన్నారు.






