‘శ్రీనివాస మంగాపురం’ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మహేష్ బాబు

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-26 10:24:46  IST  )

ఈ సినిమా కోసం తమ ఫ్యామిలీ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు.

‘శ్రీనివాస మంగాపురం’ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మహేష్ బాబు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంతో నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూలై 30న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో జయకృష్ణకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. జయకృష్ణ వైజయంతీ మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌పై హీరోగా ఎంట్రీ ఇవ్వడం తనకు చాలా ఆనందంగా ఉందని మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం తమ ఫ్యామిలీ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు. సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ చాలా బాగున్నాయని, ముఖ్యంగా ఇందులో జయకృష్ణ, రాషా ఇద్దరూ అద్భుతంగా పనిచేశారని మెచ్చుకున్నారు.

ఈ మూవీలో ‘అల్లెల్లి’ పాట తనకు బాగా నచ్చిందని ఆయన పేర్కొన్నారు. అలాగే, తన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ కూడా జూలై 30వ తేదీనే రిలీజ్ అయిందని గుర్తుచేసుకుంటూ.. ఈ సినిమాను కూడా అదే రోజున విడుదల చేయడం వెనుక బహుశా నిర్మాత అశ్వినీదత్ గారి ప్లాన్ ఉండి ఉంటుందని అన్నారు. తాను, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా అందరూ వైజయంతీ బ్యానర్‌లోనే పరిచయం అయ్యామని, అది తమ అదృష్టమని చెబుతూ.. ఇప్పుడు అదే బ్యానర్ ద్వారా పరిచయం అవుతున్న జయకృష్ణ, రాషా కూడా చాలా లక్కీ అని అన్నారు. తన అభిమానులందరూ కూడా వారికి పూర్తి అండగా నిలవాలని మహేష్ బాబు మనస్ఫూర్తిగా కోరారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో మోహన్ బాబు, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. జూలై ౩౦న రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story