- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేసీఐ సికింద్రాబాద్‌కు పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు
జేసీఐ ఇండియా జోన్–12 ఆధ్వర్యంలో నిర్వహించిన మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్‌లో జేసీఐ సికింద్రాబాద్ వివిధ సామాజిక సేవాకార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.

దిశ, సికింద్రాబాద్ : జేసీఐ ఇండియా జోన్–12 ఆధ్వర్యంలో నిర్వహించిన మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్‌లో జేసీఐ సికింద్రాబాద్ వివిధ సామాజిక సేవాకార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. సంక్రాంతి సంబరాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు, ఉచిత పుస్తకాల పంపిణీ, డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు తదితర సేవా కార్యక్రమాలకు వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి. అలాగే జేసీఐ ట్యునీషియా, మారిషస్, ఆఫ్రికా చాప్టర్లతో కలిసి నిర్వహించిన క్లైమేట్ యాక్షన్ నెక్సస్ అంతర్జాతీయ సహకార కార్యక్రమం జోన్–12లో జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్కే ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.
అంతే కాకుండా, ఎంఆర్ఎఫ్ విభాగంలో జోన్–12లో నంబర్–1 చాప్టర్‌గా జేసీఐ సికింద్రాబాద్ నిలిచింది. మరో విశేషంగా, జపాన్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్‌లో జేసీఐ ఇండియాకు చెందిన 1,400 చాప్టర్లలో జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ నిర్వహించిన ఫండ్ రైజర్ "తంబోలా" కార్యక్రమం మాత్రమే ప్రత్యేకంగా ఫీచర్ కావడం సంస్థకు దక్కిన అరుదైన గౌరవంగా నిలిచింది. ఈ అవార్డులను రీజియన్–సి వైస్ ప్రెసిడెంట్ జయంత్ శెట్టి అందజేశారు. వ్యక్తిగత అవార్డుల విభాగంలో జేఎఫ్‌ఎం శిల్పా లింగ ఉత్తమ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఈ విజయాలకు సహకరించిన జోన్ అధికారులకు, పూర్వ అధ్యక్షులకు, సభ్యులకు శిల్పా లింగ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో మరిన్ని వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో జేసీఐ సికింద్రాబాద్ ముందంజలో కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.






