కోయంబత్తూరులో రామ్ చరణ్‌కు సర్జరీ.. తోడుగా మెగా ఫ్యామిలీ

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

కోయంబత్తూరులో రామ్ చరణ్‌కు సర్జరీ.. తోడుగా మెగా ఫ్యామిలీ
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకి గాయం కాగా.. ప్రమోషన్స్‌లో కూడా చేతికి కట్టుతోనే హాజరయ్యాడు. దీనికి సర్జరీ అవసరమవుతుందని అప్పట్లో వార్తలు రాగా.. చివరకు ఇప్పుడు రామ్ చరణ్ సర్జరీ చేయించుకుంటున్నాడు. ఈ సర్జరీ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం జరగనుంది. ఇందుకోసం రామ్ చరణ్‌కు తోడుగా తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో భార్య ఉపాసన కోయంబత్తూరుకు బయలుదేరారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి కోరుకుంటూ మెసేజులు చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story