- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. తీరనున్న ప్రయాణ కష్టాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం.. సిద్ధిపేట జిల్లాలో ఉన్న కొమురవెల్లిలో నూతన రైల్వేస్టేషన్ ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం.. సిద్ధిపేట జిల్లాలో ఉన్న కొమురవెల్లిలో నూతన రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఆదివారం సాయంత్రం ఈ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కొమురవెల్లి పుణ్యక్షేత్రంలో రైల్వేస్టేషన్ను ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇకపై ప్రయాణ కష్టాలు తీరుతాయన్నారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ద్వారా మరింత సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయవచ్చన్నారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ను మల్లన్న భక్తులకు అంకితం చేస్తున్నామని తెలిపారు.
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు బస్సులు, ఇతర వాహనాల్లో వస్తుంటారు. ముఖ్యంగా బస్సుల్లో వచ్చే భక్తులు ఆలయానికి చేరుకునేందుకు, తిరిగి వెళ్లేందుకు మెయిన్ రోడ్డుపై గంటలకొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, చిరువ్యాపారాలుదీ ఇదే పరిస్థితి. తాజాగా కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమవ్వడంతో.. ఇకపై ఇక్కడికి విచ్చేసే భక్తులకు, కొమురవెల్లి నుంచి నిత్యం ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారికి మరింత ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.
కొమురవెల్లి స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి సిద్ధిపేట వరకూ నడుస్తున్న 4 డెమూ రైళ్లను నిలిపి ఉంచనున్నారు. సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్ వచ్చే 77654 డెమూ రైలు బుధవారం మినహా ప్రతిరోజూ మధ్యాహ్నం 2.38 గంటలకు, 77656 డెమూ రైలు గురువారం మినహా ప్రతిరోజూ ఉదయం 6.45 గంటలకు కొమురవెల్లి చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి సిద్ధిపేటకు 77653 డెమూ రైలు బుధవారం మినహా ప్రతిరోజూ మధ్యాహ్నం 12.44 గంటలకు, 77655 డెమూ రైలు ప్రతిరోజూ రాత్రి 8.04 గంటలకు కొమురవెల్లికి చేరుకుంటుంది.






