- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో భారీ వాన.. ఈ ప్రాంతంలో దంచికొడుతున్న వర్షం
నగరమంతటా దట్టమైన మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడి, పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఉదయం నుంచి ఎండ, మబ్బులతో ఉన్న నగర వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఆకాశం చల్లబడింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్, బీఎన్ రెడ్డి, హయత్ నగర్, కుంట్లూర్, ఉప్పల్, రామంతపూర్, సికింద్రబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో మరిన్ని ప్రాంతాలకు ఈ వర్షం విస్తరించే అవకాశం ఉందని, వాహనదారులు అలర్ట్ గా ఉండాలని వాతావరణ నిపుణులు అలర్ట్ జారీ చేశారు. దీంతో అప్రమత్తం అయిన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది లోతట్టు ప్రాంతాల వద్ద వర్షపు నీటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
Next Story






