ప్రజాభవన్‌లో ఘనంగా ఆషాడ బోనాలు.. అమ్మవారికి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు

by Ramesh Naini |

ఆషాడ బోనాలను ప్రజాభవన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ఈ సంబరాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.

ప్రజాభవన్‌లో ఘనంగా ఆషాడ బోనాలు.. అమ్మవారికి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆషాడ బోనాలను ప్రజాభవన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ఈ సంబరాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భట్టి విక్రమార్క సతీమణి నందిని సంప్రదాయబద్ధంగా, భక్తి భావంతో బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ప్రజా భవన్ ప్రాంగణం మార్మోగింది.

మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తమ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళల కోలాటం, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ జోగిని శ్యామల తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు.

Next Story