India vs Zimbabwe : మూడోది మనదే.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా

by Harish |

India vs Zimbabwe : మూడోది మనదే.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
X

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గిన భారత జట్టు ఆదివారం జరిగిన మూడో టీ20లోనూ విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేసి సత్తాచాటాడు. ఇషాన్ కిషన్(29), శ్రేయస్ అయ్యర్(27), రింకు సింగ్ (25) విలువైన రన్స్ జత చేశారు. ఇక చేజింగ్‌లో జింబాబ్వే మళ్లీ తేలిపోయింది. 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో ర్యాన్ బుర్ల్(54 నాటౌట్) మాత్రమే రాణించాడు. అతని పోరాటంతోనే జింబాబ్వే ఆ స్కోరు చేయగలిగింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ 3 వికెట్లతో విజృంభించి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. యశ్ ఠాకూర్ 2 వికెట్లతో రాణించాడు.

Next Story